ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ దర్శకులపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు . అందులో భాగంగా కొంత కాలం క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తమిళ సినీ పరిశ్రమ  లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది.

ఇకపోతే ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ఇప్పటికే బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేసి విజయాన్ని అందుకోగా , మరో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ కూడా సౌత్ దర్శకుడుతో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు సమాచారం. మరి అమీర్ సౌత్ ఇండస్ట్రీ లో ఏ దర్శకుడితో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: