మాస్ మహారాజా రవితేజ కెరియర్ ప్రారంభంలో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత ఈయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలో కూడా నటించాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి నటుడిగా కెరియర్ ను టర్న్ చేసుకున్న రవితేజ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఇక హీరోగా అవకాశాలను దక్కించుకొవడం మొదలు పెట్టిన తర్వాత ఈయన వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన హీరోగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రవితేజ ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాలను అందుకోవడం లేదు. ఆఖరుగా ఈయన నటించిన దమాకా సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. పోయిన సంవత్సరం రవితేజ మొదటగా రావణాసుర సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఇక తాజాగా రవితేజ "మిస్టర్ బచ్చన్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈయన అభిమానులు. మరియు సాధారణ ప్రేక్షకులు కూడా రవితేజ కాస్త డిఫరెంట్ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కమర్షియల్ సినిమాలలో నటించడం వల్లే ఆయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి రవితేజ ఇప్పటికైనా తన రూటు మార్చి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలలో నటిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: