దేవదాసు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.దాంతో రామ్ పోతినేని యంగ్ హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో రాణించారు అలా ఈయన సినీ కెరియర్లో రామ రామ కృష్ణకృష్ణ,కందిరీగ,రెడీ,నేను శైలజ, శివమ్,ఉన్నది ఒకటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి.
అయితే ఈయన చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాల్లో ఫ్లాప్ అయినా కూడా రామ్ పోతినేని కి చాక్లెట్ బాయ్ గా.. ఎనర్జిటిక్ స్టార్ గా ఇండస్ట్రీలో పేరుంది.ఇదిలావుండగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు డబుల్ ఇస్మార్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా పూరీ కనెక్ట్ బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ నిర్మాతగా, దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించారు.అయితే కటెంట్ విషయంలో ఫెయిల్ కావడంతో ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులేస్తున్నది.వారియర్, స్కంద లేటెస్ట్ రిలీజ్ డబుల్ ఇస్మార్ట్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ సాధించాడు. మాస్ చిత్రాల మోజులో తన స్ట్రాంగ్ జోన్ వదిలేసి పరాజయాల బాట పట్టాడు రామ్ పోతినేని. రామ్ లాస్ట్ మూడు సినిమాలు వేటికవే పోటీపడి మరి ఫ్లాప్స్ అయ్యాయి.ఒకసారి రామ్ ఫ్లాప్స్ గమనిస్తే ముందుగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన వారియర్. దాదాపు ఓ ఆరు ఏడూ ఏళ్ల క్రితం బన్నీ హీరోగా రావాల్సిన సినిమాను రామ్ తో తెరకెక్కించి దారుణమైన ఫ్లాప్ ఇచ్చాడు లింగుస్వామి. అసలు ఈ దర్శకుడితో సినిమా ఎలా చేసాడో రామ్ కే తెలియాలి.


ఇక రెండవ సినిమా స్కంద. భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఓవర్ మాస్, వయసుకు మించిన పాత్రలో నటించి ఫ్లాప్ తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్ రిలీజ్ డబుల్ వారియర్ సంగతి సరేసరి. రిలీజ్ అయిన రెండవ రోజే థియేటర్లు కాళీ అయ్యాయంటే ఎంతటి దారుణమైన డిజాస్టరో అర్ధం చేసుకోవాలి. రామ్ ను ఆడియన్స్ నేను శైలజ, రెడీ, దేవదాస్ వంటి లవర్ బాయ్ రోల్స్ లో చుడాలిఅనుకుంటే ఈ హీరో మాస్ జపం చేస్తూ సూపర్ ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మిస్టర్ బచ్చన్ తో ఫ్రెష్ గా డబుల్ డిజాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇప్పటికయిన మేల్కొని పెదనాన్న ‘స్రవంతి రవికిశోర్’ సూచనల ప్రకారం వెళ్తే కెరిర్ బాగుంటుంది, లేదంటే ఇండస్ట్రీలో ఫ్లాప్ స్టార్ అనే బిరుదు తీసుకోవాల్సి వస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయనకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. అందులో భాగంగానే రామ్ నటించిన రెడ్ , వారియర్ , స్కంద చిత్రాలు కూడా ఘోరమైన పరాభవాన్ని చూసాయి. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న డబుల్ ఇస్మార్ట్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ మేరకు ఈయన నెక్స్ట్ కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: