తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ప్రభాస్‌ను ఆదివారం ఒక కార్యక్రమంలో పొగిడిన సంగతి తెలిసిందే. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ తెలుగు సినిమాకు ఎంతో గొప్ప పేరు తెచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్‌లా మరో కులం నటుడు ఆ పాత్రను చేయలేరు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. క్షత్రియ కమ్యూనిటీ ప్రజలు చాలా గొప్పవారు అన్నట్లు మాట్లాడారు.

 నిజానికి బాహుబలి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ వివిధ కులాలకు చెందినవారు కాబట్టి ఆ సినిమా సక్సెస్ ని క్షత్రియ కమ్యూనిటీలో వేయడం చాలా తప్పు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ కుల గజ్జి భారత దేశంలో ఎప్పుడు అంతరించిపోతుందో అప్పుడే ఇండియా బాగుపడుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఒక కులం వారి గురించే మాట్లాడడానికి సీఎం వెళ్లడం బాగోలేదని కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణలో ఇంత బహిరంగంగా కులాల గురించి సీఎం మాట్లాడటం చాలా షాకింగ్ గా ఉందని మరి కొంతమంది  వ్యాఖ్యానిస్తున్నారు. కులాల పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది, దీనివల్ల ఎవరికి ఉపయోగం అని చాలామంది ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి క్షత్రియ సేవా సమితికి వెళ్లడమే తప్పు అనేలాగా నేటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే ప్రభాస్ ఇటీవల హను రాఘవపూడితో కలిసి ఫౌజీ అని సినిమాని లాంచ్ చేశాడు ఇందులో ఇమాన్వి అనే డ్యాన్సర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంది కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలో వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతున్నారు. చాలా అందంగా ఉంది కాబట్టి మీకు మరిన్ని అవకాశాలు తెలుగులో రావచ్చు అని అంటున్నారు. మరి చూడాలి ఆమె నటిస్తున్న మొదటి సినిమా పెద్ద హిట్ అవుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: