తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ పోతినేని ఈ మధ్యకాలంలో వరస అపజాయలను ఎదుర్కొంటున్నాడు. ఈయన ఆఖరుగా ఇస్మార్ట్ శంకర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ నటుడు తమిళ దర్శకుడు అయినటువంటి లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఏక కాలంలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమా తర్వాత ఈ నటుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ ఏకంగా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా కూడా రామ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇకపోతే తాజాగా రామ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి కలెక్షన్లు చాలా తక్కువగా దక్కుతున్నాయి.

ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ కి నిరాశనే మిగిల్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా ఇప్పటికే దాదాపుగా వరుసగా మూడు అపజయాలను అందుకున్న రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది. ఈ దర్శకుడు తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకునే అవకాశాలే ఉన్నాయి. ఇప్పటికే వరస అపజాయలతో ఉన్న రామ్ మరోసారి అపజయం అందుకున్న దర్శకుడికి ఛాన్స్ ఇస్తూ ఉండడంతో ఆయన అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: