తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పక్కా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. వరుసగా మూవీల మీద మూవీలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. అదే సమయంలో తన పాత చిత్రాల ద్వారా కూడా ఈ బడా హీరో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇలా ఇటీవలే మహేశ్ బాబు 'మురారి' సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇది భారీ వసూళ్లతో దుమ్ములేపుతోంది.మురారి' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన లభించింది. దీంతో4 రోజుల్లో నైజాంలో రూ. 4.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.77 కోట్లతో కలిపి రూ. 7.17 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా నాలుగు రోజుల్లో రూ. 8.52 కోట్లు గ్రాస్ వచ్చింది.ఓల్డ్ మూవీల రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని చిత్రాలు టాప్ కలెక్షన్లతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మురారి సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానానికి చేరుకుంది.ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమాకు స్పెషల్. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 2002లో రిలీజైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ చిత్రం విడుదలై ఇటీవల 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్ర రిరిలీజ్ కు ప్లాన్ చేసారు మేకర్స్. ఈ ఆగస్టు 22న ఇంద్ర రీరిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్స్ ఓపెన్ చేయగా నిమిషాల వ్యవధిలో టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయ్యాయి. దింతో మరిన్ని షోస్ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తుంటే ఇటీవల రీరిలీజ్ అయిన మురారి 4K(9.12)కోట్ల రూపాయల రికార్డును బద్దలు కొట్టేలాగా ఉంది ఇంద్ర. గమ్మతైనా విషయం ఏంటంటే ఇంద్ర రిలీజ్ టైమ్ లో క్రియేట్ చేసిన రికార్డును పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన పోకిరి (2006)తో బద్దలు కొట్టాడు. ఇప్పుడు మహేశ్ రీరిలీజ్ రికార్డును బద్దల కొట్టేలాగా ఉన్నారు చిరు. చిరు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆగస్టు 22న మళ్లీ విడుదల కాబోతున్న ఇంద్ర తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ద్వారా రీరిలీజ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంద్ర రిరిలీజ్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రీరిలీజ్ లో ఇంద్ర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: