మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో రెండవ సినిమాగా మగధీర మూవీ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ , ఎస్ ఎస్ రాజమౌళి ముగ్గురు క్రేజ్ కూడా అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే రాజమౌళి ఈ సినిమాలో మొదట హీరోయిన్ పాత్ర కోసం కాజల్ ను కాకుండా అనుష్క ను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా అనుష్క కి కూడా కథను వివరించాడట. కాకపోతే ఆ తర్వాత అనుష్క కంటే కూడా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా బాగుంటుంది అనే ఉద్దేశానికి రాజమౌళి రావడం , దానితో అనుష్కను కాకుండా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా కాజల్ అగర్వాల్ కు మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం దక్కడం మాత్రమే కాకుండా సూపర్ సాలిడ్ క్రేజ్ కూడా వచ్చింది. ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు మరియు బాహుబలి సిరీస్ మూవీ లలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ల ద్వారా అనుష్క కు అద్భుతమైన గుర్తింపు దక్కింది. అలాగే సూపర్ సక్సెస్ లో కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: