ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలోని నటనకు గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. కొంతకాలం క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీకి దగ్గర ఏ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించలేదు.

ఇక అనుహ్యంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ఈ సినిమాకు కొత్త కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించక ముందే డిసెంబర్ నెలలో కొన్ని సినిమాలు రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. డిసెంబర్ నెలలో భారీ అంచనాలు కలిగినటువంటి గేమ్ చేంజర్ సినిమా కూడా విడుదల కాబోతుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాతోనే ఇంతకాలం ప్రాబ్లం ఉంది అనుకుంటే తాజాగా పుష్ప మూవీ కి మరో కొత్త ప్రాబ్లం ఎదురవబోతోంది. డిసెంబర్ 6 వ తేదీన హిందీ సినిమా అయినటువంటి చ్చావ మూవీ కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు గనక మంచి టాక్ వచ్చినట్లు అయితే హిందీ ఏరియాలో పుష్ప 2 మూవీ కలెక్షన్లపై కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలా ఆగస్టు 15 వ తేదీ నుండి డిసెంబర్ 6 వ తేదీకి పోస్ట్ పోన్ కావడం వల్ల పుష్ప 2 మూవీ కి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa