టాలీవుడ్ లో పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీలీల ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. గత ఏడాది ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తెలుగులో ఈ హీరోయిన్ కి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.ధమాకా చిత్రంలో శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శ్రీలీల డ్యాన్స్ కి, ఆమె గ్లామర్, క్యూట్ నెస్ కి యువత ఫిదా అయ్యారు. ఒక్కసారిగా శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ తర్వాత శ్రీలీల ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమెకి హిట్ దక్కలేదు. భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్యకి కూతురిలా నటించింది. ధమాకా తర్వాత శ్రీలీల హీరోయిన్ గా నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.దీనితో శ్రీలీల ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకుంటోంది. తాను ఎంచుకునే చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని,ప్రతి కథని ఓకె చేసేయ కూడదని భావిస్తోంది. అయితే తాజాగా శ్రీలీల ఒక క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ లో, వశిష్ట్  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫాంటసీ డ్రామాగా వశిష్ట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆషిక రంగనాథ్, మరి కొంతమంది హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ఉందట. దీనితో దర్శక నిర్మాతలు శ్రీలీలని  సంప్రదించారు.

భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ శ్రీలీల దీనిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి చిత్రంలో స్పెషల్ సాంగ్ ని శ్రీలీల రిజెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అదేంటి శ్రీలీల అంత పెద్ద షాకిచ్చింది అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.గతేడాదితో పోలిస్తే శ్రీలీలకి ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. ఈ టైంలో స్పెషల్ సాంగ్స్ చేస్తే.. ఆమె డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.అందుకోసమే.. చిరంజీవి సినిమా అయినప్పటికీ, నో చెప్పిందని తెలుస్తుంది. దీంతో మేకర్స్ మరో హీరోయిన్ కోసం గాలిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ‘బ్రో’  సినిమాలో ఊర్వశి రౌతేలా  చేసిన స్పెషల్ సాంగ్ కోసం కూడా ముందుగా శ్రీలీలని సంప్రదించారట. అప్పుడు కూడా ఆమె నో చెప్పింది. సో అప్పుడు తమ్ముడు సినిమాలో.. ఇప్పుడున్న సినిమాలో.. స్పెషల్ సాంగ్స్ చేయడానికి శ్రీలీల నిరాకరించినట్టు స్పష్టమవుతుంది. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’  లో శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: