మీర్జాపూర్ సిరీస్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా, బీనా ఆంటీ ఈ పేర్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ సిరీస్ ఫేమస్ అయ్యింది. 2018 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో 9 ఎపిసోడ్లతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. బూతు పదాలు, ఘాటు రొమాన్స్ తో అప్పట్లో పెను సంచలాన్ని సృష్టించిన సిరీస్ అంటే ఇదే. ఇక ఈ సిరీస్ లో బీనా ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఖాలీన్ భయ్యా ముద్దుల భార్య. భర్త అందించే సుఖం అందక.. పనివాడితో రొమాన్స్ చేస్తూ.. మామకు దొరికిపోతుంది. తక్కువజాతి వాడి రక్తంతో బిడ్డ పుట్టకూడదని మామనే ఆమెతో శృంగారంలో పాల్గొంటాడు. అంతటితో మీర్జాపూర్ మొదటి సీజన్ ముగుస్తోంది. ఇక సీజన్ లో సైతం అమ్మడు రెచ్చగొట్టే విధానము వేరే లెవెల్ ఉంటుంది.ఇక బీనాగా నటించిన నటి ఎవరో కాదు రసికా దుగల్. ఈ రెండు సీజన్స్ తో ఆమె పేరు బాలీవుడ్ లో మాములుగా మోగలేదు.ఇదిలావుండగా ‘మిర్జాపూర్’… హిందీ వెబ్ సిరీస్ అయినప్పటికీ సౌత్ లాంగ్వేజెస్ లోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. దానికి కారణం డబ్బింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఎక్కువగా బూతులు వంటివి ఉండటం..

అయితే, మరొక కారణం.. ఈ సిరీస్ లో లవ్ మేకింగ్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అని చెప్పొచ్చు. ఈ సిరీస్లో బీనా ఆంటీ పాత్ర బాగా ఫేమస్. ఈమె చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.ఆమె అసలు పేరు రసిక్ దుగల్అయినప్పటికీ బీనా ఆంటీగానే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి స్పందిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. రసిక దుగల్ మాట్లాడుతూ.. “నాకు ఎక్కువగా ఏడ్చే సీన్లే ఇస్తుండేవారు. ఇక ఏడవడం అనేది నా వల్ల కాదు.అలాంటి సీన్లు చేసి చేసి అలిసిపోయాను. నన్ను ఏ ప్రాజెక్టులో తీసుకున్నా సరే చివర్లో ఏడుపు సీన్లు ఇస్తుండేవాళ్లు.అవి నాకు బాగా బోర్ కొట్టేశాయి.ఇప్పుడు డైరెక్టర్లు నన్ను దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ రోల్స్ డిజైన్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓటీటీల వల్లనే ఇది సాధ్యమైందని నేను నమ్ముతాను. ‘మిర్జాపూర్’ కి ముందు నేను పలు సినిమాల్లో నటించాను. కానీ మీర్జాపూర్ నన్ను బాగా పాపులర్ చేసింది. దాని వల్ల నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుతున్నాను. చిన్న సినిమాలకు నన్ను ఎక్కువగా తీసుకుంటున్నారు” అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: