సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే అలా చైల్డ్ ఫోటోలను చూసిన అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా తెలుగు, హిందీ ,తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ చైల్డ్ యాక్టర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హీరోని సైతం ప్రేమించి మరి వివాహం చేసుకున్నది.


ఈ ఫోటోలో కనిపిస్తున్న చైల్డ్ యాక్టర్ పేరు సయోష సైగల్.. ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినప్పటికీ తెలుగు తమిళ్ హిందీ వంటి భాషలలో నటించింది తెలుగులో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకుంది. అయినప్పటికీ కూడా తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. తమిళంలో స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఆ తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరమయింది. అందుకు గల కారణం ఏమిటంటే..


కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో కోలీవుడ్ హీరో ఆర్యను ప్రేమించి మరి 2019లో వివాహం చేసుకున్నది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఇటీవలే మళ్లీ సాయేషా సినిమాలలోకి నటించడానికి రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఈ అమ్మడుకు సంబంధించి సోషల్ మీడియాలో చైల్డ్ యాక్టర్ ఫోటో కూడా వైరల్ గా మారుతున్నది. ఇక ఆర్య కూడా హీరో గానే కాకుండా విలన్ గా కూడా పలు చిత్రాలలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు ఆర్య. మరి రాబోయే రోజుల్లో ఈ భార్యా,భర్త కలిసి ఏదైనా సినిమాలో కనిపిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: