సినిమా పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల మధ్య ప్రొఫెషనల్‌గా ఇగో, జెలసీ ఉండటం సహజంగానే కనిపిస్తుంది. కాకపోతే ప్రొఫెషనల్ వ్యవహారకే పరిమితమవుతుంటాయి. వాటిని పబ్లిక్ చేయకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే తాజాగా అగ్ర దర్శకుల మధ్య ఇగో వ్యవహరం ఏకంగా తెరపైనే బహిర్గతమైంది. ఆ ఇద్దరు దర్శకుల ఎవరు? వారి మధ్య గొడవలు ఏమిటి? తెలుగు సినిమా పరిశ్రమల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాటర్ ఉన్న రైటర్ హరీశ్ శంకర్ ఇద్దరు టాప్ డైరెక్టర్లే. ఇద్దరిలో కామన్ పాయింట్ ఏమిటంటే.. వారిద్దరూ పవన్ కల్యాణ్‌కు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వాళ్లే. అలాంటి దర్శకుల మధ్య ఏదో గొడవ ఉందనే వ్యవహారం తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా కొంత పొగ పెట్టింది.
మిస్టర్ బచ్చన్ సినిమాలో కొన్ని సీన్లు చూస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను డైరెక్ట్‌గా టార్గెట్ చేసినట్టు ఎలాంటి అనుమానాలు లేకుండా స్పష్టంగా అర్ధం అవుతుంది. సినిమాలోని యాక్టింగ్ గురు (ప్రభాస్ శ్రీను) లాంటి పాత్రకు గురూజీ అని పేరు పెట్టి తనలోని ఇగోను, జెలసీని బయట పెట్టుకొన్నాడా? అనే ఫీలింగ్‌ను కల్పించాడు. చాలా చోట్ల యాక్టర్ కావాలనుకొన్న ఓ ఔత్సాహికుడు (చమ్మక్ చంద్ర) పాత్ర ద్వారా తన సైటర్లను సంధించాడు.ఇక ఓ దశలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసే విధంగా డైలాగ్స్‌ను కూడా బ్లాస్ట్ చేశాడు. నేను మాటల మాంత్రికుడి కాను.. నేను మేటర్ ఉన్న రైటర్‌ను అనే చెప్పుకొనే ప్రయత్నం చేశాడు. ఇలా త్రివిక్రమ్‌ను ఎందుకు టార్గెట్ చేశారనే విషయం ఇండస్ట్రీలోను, సినీ వర్గాల్లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
త్రివిక్రమ్, హరీష్ మధ్య వ్యవహారంపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తే తప్పా.. అసలు క్లారిటీ బయటకు వచ్చే అవకాశం లేదంటులేదంటున్నారు. అయితే ఈ వివాదంపై త్రివిక్రమ్ స్పందిస్తాడా? లేదా హరీష్ వివరణ ఇస్తారా? అంటే...

ఈ వార్తలపై తాాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. హరీష్ శంకర్ మాట్లాడుతూ..”నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాకముందే త్రివిక్రమ్ కు పెద్ద ఫ్యాన్ ను. అప్పటికే ఆయనకు మూడు నంది అవార్డ్స్ డైలాగ్స్ విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత మరికొన్ని వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పని ఓ విషయం మీకు చెబుతాను. మా నాన్న త్రివిక్రమ్ కు పిచ్చి అభిమాని. ఆయనంటే ఎంత పిచ్చి అంటే.. అతడు మూవీని ఎన్నిసార్లు చూశాడో లెక్కేలేదు. నేను ఏ మూవీలో అయిన పంచ్ డైలాగ్స్, కమర్షియల్ సీన్లు ఎక్కువైతే.. త్రివిక్రమ్ ను చూసి నేర్చుకో అని చెప్పేవాడు. మా ఇంట్లో ఆయన పెద్ద కొడుకు, నేను చిన్నకొడుకు లెక్క” అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.“మా నాన్న మాటలు విన్నాక.. నేను కూడా నా  సినిమా అన్ని త్రివిక్రమ్ వాళ్ల నాన్నకు చూపించి.. సర్ మీరు కూడా నా ఫ్యాన్ అని చెప్పండి సర్, మీ ఇంట్లో చిన్న కొడుకులా ఉంటాను అని ఆయనతో చెప్పాలనుకున్నాను. అలాంటి బాండింగ్ మా ఇద్దరి మధ్య ఉంది. ఇక సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను చూసి నవ్వుకోవాల్సిందే తప్ప.. ఈ ట్రోల్స్, విమర్శలను నేను పెద్దగా పట్టించుకోను. తెలుగు సినిమా చరిత్రలో డైలాగ్స్ విషయంలో ఆయన ఓ ప్రత్యేక ముద్ర వేశారు. త్రివిక్రమ్ అంటే ఎప్పటికీ నాకు గౌరవమే ఉంటుంది” అని ఈ స్టార్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. దాంతో ఇన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: