ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల మధ్య ట్రెండింగ్ గా మారిన హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్. ఈమె గురించి తెలుసుకోవడానికి ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్స్ కూడ బాగా ఆశక్తి కనపరుస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫౌజి’ మూవీలో హీరోయిన్ గా ఇమాన్వి ఎంపిక కావడంతో ఆమె ఒక్కసారిగా నేషనల్ వైడ్ సెలెబ్రెటీగా మారిపోయింది.



ఈమె పుట్టింది పెరిగింది ఢిల్లీలో ఈమెకు డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. ఒకవైపు డాన్స్ నేర్చుకుంటూనే ఢిల్లీ లోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఎమ్ బిఏ చేసింది. ఆమెకు డాన్స్ పట్ల ఉన్న ఉత్సాహంతో తాను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసుకుని డాన్స్ లోని మెళుకువలను డాన్స్ పట్ల అభిమానం ఉన్న వారికి అర్థం అయ్యేలా తెలియ చెపుతూ ఒక యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తోంది.



యూట్యూబ్ ఛానల్ లో హేమమాలిని రేఖ లాంటి ప్రముఖ హీరోయిన్స్ గతంలో చేసిన క్లాసికల్ డాన్స్ లోని కొన్ని భంగిమలను చూపెడుతూ వాటిపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ ను పాపులర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్ కు 6 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఏరేంజ్ లో ఉందో తెలుస్తుంది.



ఒక కార్పొరేట్ కంపెనీలో తనకు వచ్చే లక్షల జీతాన్ని వదులుకుని తనకు డాన్స్ పట్ల ఉన్న అభిమానంతో ఈ యూట్యూబ్ ఛానల్ ను అదేవిధంగా తన డాన్స్ ప్రోగ్రామ్స్ ను చాల ఏకాగ్రతతో నిర్వహిస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి దృష్టిలో ఈమె చేసిన వీడియోలు పడటం జరిగింది. వాటిని ప్రభాస్ కు కూడ చూపెట్టడం అతడు ఓకె చేయడంతో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది అని అంటున్నారు. అయితే ఆమె తన డాన్స్ ప్రోగ్రామ్స్ ను పోగొట్టుకోకుండా తన డేట్స్ ను సద్దుబాటు చేస్తాను అని చెప్పి ప్రభాస్ సినిమాకు ఓకె చేసినట్లు టాక్..





మరింత సమాచారం తెలుసుకోండి: