తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప నటులు ఉన్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఎలాంటి పాత్రలో  అయినా సరే ఎంతటి కష్టం అయినా సరే భరించి చేయగలరు చిరంజీవి. చిరంజీవి కూడా సినీ ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా కష్టాలని చవిచూశారు. చిరంజీవి అండదండలతోనే ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ పొజిషన్లో కూడా ఉన్నారు. ఇక మెగా కుటుంబం గురించి టాలీవుడ్ లో ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు.


ముఖ్యంగా చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.ఆయనని చూసి ఉండకపోవచ్చు.. నిన్నటి రోజున వైల్డ్ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్ నుంచి ఒక ఫోటోను సైతం షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటుగా అభిమానులను ఖుషి అయ్యేలా చేస్తోంది. అదేమిటంటే చిరంజీవి తండ్రి కొనిదెల వెంకటరావు ఫోటోని షేర్ చేశారు.. అది కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంలో దిగిన ఒక ఫోటోని సైతం చిరంజీవి షేర్ చేస్తూ అప్పట్లో మా నాన్న హీరో లాగా ఉండేవాడు అంటూ... ఈ ఫోటో తీయడానికి తన కెమెరా కూడా ఎంతో ముచ్చటపడేది అంటూ తెలియజేశారు.



చిరంజీవి షేర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారుతున్నది.  చిరంజీవి తండ్రి కూడా అప్పట్లో షర్టు ధరించి కళ్ళజోడు పెట్టుకొని మరి సైకిల్ పైన వారికి సిద్ధమవుతున్నట్లుగా ఈ ఫోటోలో కనిపిస్తోంది. అది కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు చిరంజీవి తండ్రీ. చిరంజీవి తండ్రి కూడా పోలీస్ కావడం చేత చాలా హుందాతనంతో ఉండేవారు అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర చిత్రం పైనే అభిమానుల సైతం ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి  చివరిగా భోళా శంకర్సినిమాలో నటించిన డిజాస్టర్ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: