టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందులో కొంతమంది పాపులర్ అవుతుంటే... మరి కొంతమంది  హీరోయిన్లు... అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అయితే అప్పట్లో కొంత మంది హీరోయిన్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేర్ చేయడం జరిగింది.  అలాంటి హీరోయిన్లలో నటి సంగీత ఒకరు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

తెలుగు ఇండస్ట్రీలో ఖడ్గం సినిమాతో... ఈ బ్యూటీ బాగా పాపులర్ అయింది. ఇందులో సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చిన పల్లెటూరి పాత్రలో మెరిసింది సంగీత. ఈ సినిమాలో ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమాలుడుతూ... హీరోయిన్ సంగీత.. తెగ హల్చల్ చేసింది. అయితే హీరోయిన్ సంగీత... ప్రముఖ సింగర్ క్రిష్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది.


ఇక వీరికి ఒక కూతురు కూడా ఉండడం జరిగింది. అయితే తాజాగా... గుణ చిత్ర పాత్ర ల్లో  నటించిన సంగీత... ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ సినిమాల లో కంటే తెలుగు సినిమాలలో నటించడం తనకు చాలా ఇష్టమని స్పష్టం చేసింది. అసలు తమిళ ఇండస్ట్రీ లో నటించడం తనకు అస హ్యం అని స్పష్టం చేసింది. ఈ మాటలు విన్న తమిళ ప్రేక్షకులు తనపై మండిపడతారని కూడా వెల్లడించింది.

 అసలు తమిళ ఇండస్ట్రీ లో నటిస్తే మనకు గౌరవం ఉండదని నటి సంగీత చెప్పడం జరిగింది. తమిళ ఇండస్ట్రీ లో తనకు ఎవరు అవకాశాలు  సరిగా ఇవ్వలేదని కూడా తెలిపారు.  అదే తెలుగులో అయితే  చిన్న పాత్ర చేసిన కూడా మంచి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు హీరోయిన్ సంగీత. తమిళ ఇండస్ట్రీలో అయితే ఫోన్ చేసిన కూడా మనకు మర్యాద దక్కదని తెలిపారు. అందుకే తాను తమిళ ఇండస్ట్రీ లో సినిమాలు అస్సలు చేయడం లేదని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: