తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి దేశ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ "ఈశ్వర్" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. 

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ప్రభాస్ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తేదీన ఈశ్వర్ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి అనేక సినిమాలు రీ రిలీస్ అవుతున్నాయి. అందులో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంటున్నాయి. ఇకపోతే ఈశ్వర్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే అక్టోబర్ 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈశ్వర్ మూవీ లోని నటనకు గాను ప్రభాస్ కి ఆ సమయంలో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: