మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీసినిమా విడుదలకు ముందు నుండే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాల్లోనే అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోయడంతో ఈ బ్యూటీ కి ఈ సినిమా విడుదలకు ముందే తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు లభించింది.

అనేక ఇతర సినిమాలలో కూడా అవకాశాలు దక్కినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మంచి అంచనాలు నడుమ ఆగస్టు 15 వ తేదీన విడుదలైన మిస్టర్ బచ్చన్ మూవీ కి మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి అపజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ కి తెలుగులో మొదటి అవకాశం మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా కాకుండా మరో సూపర్ హిట్ సినిమా ద్వారా వచ్చిందట.

కాకపోతే ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా కాకుండా ఈ సినిమా చేసినట్టు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ఆగస్టు 15 వ తేదీనే నార్ని నితిన్ హీరోగా రూపొందిన ఆయ్ అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మొదట భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఈమెకు రవితేజ హీరోగా రూపొందబోయే సినిమాలో ఆఫర్ రావడంతో ఈమె ఈ సినిమా వైపు ఇంట్రెస్ట్ చూపించిందంట. అలా ఆయ్ మూవీ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆయ్ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అలాగే ఈ సినిమా కూడా ఇప్పటికే మంచి విజయం కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: