న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా మూవీ సరిపోదా శనివారం.. ఈ సినిమా ఆగస్టు 29న గ్రాండ్ గా విడుదలవ్వడంతో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు.అయితే ఈ ఆగస్టులో వచ్చిన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.ఇక ఆయ్ సినిమా ఆకట్టుకున్నప్పటికీ ఈ మూవీ కి సరిపోయే థియేటర్లు లేవు. అలాగే తంగలాన్ మూవీ కూడా హిట్ అయింది. కానీ ఆగస్టు చివరిలో వచ్చే సరిపోదా శనివారం మూవీ  ఆగస్టు ఫినిషర్ గా మారుతుందా అని చాలామంది సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్, టీజర్, పాటలు అన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే సరిపోదా శనివారం మూవీకి సంబంధించి ప్రమోషన్స్ భారీ ఎత్తున చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నానిసినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఎవరో బయటపెట్టారు. మరి ఇంతకీ నాని నటించిన ఏ సినిమా డిజాస్టర్ అయ్యింది. దానికి కారణం ఎవరి పేరు బయటపెట్టారు అనేది చూద్దాం. నాని దసరా, హాయ్ నాన్న వంటి రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.ఇక సరిపోదా శనివారం సినిమా హిట్ అయితే మాత్రం హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే. అయితే దసరా మూవీ కంటే ముందు వచ్చిన అంటే సుందరానికి సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా డిజాస్టర్ కి కారణం తానేనని ఈ సినిమా డైరెక్టర్ స్టోరీ ఎలా చెప్పారో అలాగే తెరకెక్కించారు.

కానీ నేను ఆ సినిమా ఎలా ఉంటుందో ఆ అంచనాలను జనాల్లోకి తీసుకు వెళ్లడంలో విఫలమయ్యాను.అందుకే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ అవ్వడానికి అసలు కారణం నేనే అంటూ చిత్ర ప్రమోషన్స్ భాగంగా నాని చెన్నై కి వెళ్ళిన సమయంలో ఈ విషయం బయటపెట్టారు. దీంతో నాని మాటలు విన్న చాలా మంది జనాలు సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీద లేదా హీరోయిన్ మీద వేసే చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి నేనే కారణం అని ఒప్పుకునే హీరోలు ఎవరు లేరు నాని తప్ప అంటూ నానిని మెచ్చుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: