తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించాడు. ఈ సినిమా తర్వాత మిరపకాయ్ మూవీ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక గబ్బర్ సింగ్ మూవీ తర్వాత హరీష్ చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆ సినిమాలు ఏవి కూడా గబ్బర్ సింగ్ స్థాయి విజయాన్ని అందుకోలేదు.

తాజాగా ఈ దర్శకుడు హిందీ లో సూపర్ హిట్ విజయం అందుకున్న రైడ్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా మాస్ మహారాజా రవితేజ హీరో గా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో సినిమాని రూపొందించాడు. ఆగస్టు 15వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు కలెక్షన్ లు కూడా పెద్ద మొత్తంలో దక్కడం లేదు. దానితో హరీష్ శంకర్సినిమా కలెక్షన్లను పెంచే ఉద్దేశంతో తాజాగా కొంత మంది తో మాట్లాడాడు. అందులో భాగంగా హరీష్ శంకర్ స్పందిస్తూ ... కొంత మంది కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు.

గతంలో రవితేజ హీరోగా రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ , కిలాడి , టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ మూవీలు కూడా ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. ఆ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. నన్ను మాత్రం పని కట్టుకొని మరి టార్గెట్ చేస్తున్నారు అని హరీష్ శంకర్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: