యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హరీష్ శంకర్ కాంబోలో కొన్ని సంవత్సరాల క్రితం రామయ్య వస్తావయ్య అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత , శృతి హాసన్ హీరోయిన్లుగా నటించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో హీరోగా నటించడం , గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

దానితో ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ అయిన తర్వాత హరీష్ శంకర్ , జూనియర్ ఎన్టీఆర్ కు అపజయాన్ని ఇచ్చాను. తిరిగి ఆయనకు అద్భుతమైన విజయాన్ని అందిస్తాను అని చెప్పుకొచ్చాడు. తాజాగా హరీష్ శంకర్ , రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ఈవెంట్ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈయనకు మీరు జూనియర్ ఎన్టీఆర్ కు ఒక అద్భుతమైన విజయాన్ని అందిస్తాను అన్నారు. ఆ సినిమా ఎప్పుడు ఉండొచ్చు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరీష్ శంకర్ సమాధానం ఇస్తూ ... కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక మంచి విజయాన్ని అందిస్తాను. కానీ దానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అనేక సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. దానితో ఇప్పట్లో ఆయనను కలిసి కథను వినిపించి అతనితో సినిమా చేయడం అనేది కాస్త కష్టమైన పని. అందుకే కొంత కాలం తర్వాత ఆయనతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తా అని హరీష్ శంకర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: