టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగించిన పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాలను అందుకోలేక పోతున్నాడు. ఈ దర్శకుడు కొంత కాలం క్రితం లైగర్ అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు ఇస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు.

రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమాలో కావ్య దాపర్ హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇకపోతే కెరియర్ ప్రారంభం నుండి కూడా పూరి జగన్నాథ్ తన సినిమాలలో ఆలీ కి సంబంధించిన సపరేట్ ట్రాక్ లను పెడుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో చాలా ట్రాక్ లు సూపర్ సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే డబల్ ఇస్మార్ట్ మూవీ లో కూడా ఆలీ తో అలాంటి ట్రాక్ నే ఒక దానిని రెడీ చేశాడు. ఇక ఈ సినిమాలో ఆలీ బోక అనే పాత్రలో కనిపించాడు. ఇక ఈ బోక అనే పదం పైనే అనేక మంది అది బూతు పడంలా ఉంది అనే విమర్శలను వినిపించారు. ఇక సినిమా విడుదల తర్వాత కూడా ఈ పాత్ర ఏ మాత్రం ప్రేక్షకులకు నచ్చకపోవడం , అలాగే ఈ సినిమా ,కు ఆ పాత్రకు పెద్దగా సంబంధం లేదు అనే కామెంట్స్ రావడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అలీ కి సంబంధించిన బోక పాత్ర సన్నివేశాలను తొలగిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: