యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం రాఖీ అనే సిస్టర్ సెంటిమెంట్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం అన్నవరం అనే సిస్టర్ సెంటిమెంట్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలు కేవలం వారం గ్యాప్ లో మాత్రమే విడుదల అయ్యాయి. రాఖీ సినిమా 2006 వ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల కాగా , అన్నవరం సినిమా ఇదే సంవత్సరం డిసెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ రెండు సినిమాలు భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యాయి.

అందులో భాగంగా రాఖీ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్ లు చాలా వరకు పడిపోయాయి. ఇకపోతే అన్నవరం సినిమాకు విడుదల అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా ఆ తర్వాత బాగా పుంజుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసింది. మరి వారం తేడాలో విడుదల అయిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ లకు టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఏ సినిమాకు ఎంత కలెక్షన్ లు వచ్చాయి.

మూవీ ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం. రాఖీ మూవీ ఫుల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 12 కోట్ల కలెక్షన్ లను రాబట్టి యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక అన్నవరం సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 21 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా రాఖీ సినిమా మంచి టాక్ ను తెచ్చుకున్న ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అన్నవరం సినిమాకు ముందు ప్లాప్ టాక్ వచ్చిన ఆ తర్వాత కలెక్షన్ లు పుంజుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: