బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ ఏం సాధించలేదు. బాహుబలి తర్వాత నేనే రాజు నేనే మంత్రితో అలరించాడు. ఆ తర్వాత ఆయనకు అన్నీ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. విరాట పర్వం తర్వాత ఈ హీరో గ్రాఫ్ బాగా పడిపోయింది. బాబాయి వెంకటేష్ తో కలిసి ఆయన నటించిన "రానా నాయుడు" వెబ్ సిరీస్ కూడా నెగెటివిటీకి తెచ్చింది కానీ అతనికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దీని తర్వాత ఈ హీరో నిఖిల్ నటించిన "స్పై" సినిమాలో ఓ స్పెషల్ రోల్ పోషించి అలరించాడు.

స్టార్ యాక్టర్ ఇటీవల కాలంలో యాక్టింగ్ కంటే నిర్మాణం పైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాడు. అలాగే ఇతర సినిమాలను ప్రమోట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆఫ్ స్క్రీన్ లైఫ్ ను రానా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తోటి నటీనటులతో కూడా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. యంగ్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లలో ఎక్కువగా హాజరవుతున్నాడు. రానా ఓన్లీ ఇండస్ట్రీ వారిపైనే కాకుండా సామాన్యులపై ముఖ్యంగా తన అభిమానులపై ప్రేమ కురిపిస్తుంటాడు. మరోసారి అతను తన అభిమానుల పట్ల ప్రేమను చాటుకున్నాడు.

ప్రస్తుతం అమెరికా వెకేషన్‌లో ఉన్న ఈ హీరో అనుకోకుండా అభిమానులను కలిశాడు. ఈయన చికాగో రోడ్లపై కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఇతని అభిమాని ఒకరు గమనించారు. ఆయన కూడా కారులో వెళ్తున్నారు. రానా అతన్ని చూసి కారు ముందు ఆపుతా అని సైగ చేశాడు. చెప్పినట్లే కారు పక్కన ఆపాడు రానా. ఆ తర్వాత ఆ అభిమానులను ప్రేమగా పలకరించాడు. వారితో సెల్ఫీలు దిగాడు. కారు పైన "బెస్ట్ విషెస్ RD" అని రాశాడు. అంతేకాకుండా చాలా కాగితాలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. అయితే అతని అభిమాని తన గుండెలపై సంతకం చేయాలని కోరగా ముందు రానా వద్దు అన్నాడు. ఆ తర్వాత అతను ఆశగా అడగటంతో షర్ట్ పైన బెస్ట్ విషెస్ రానా అని రాశాడు. దాంతో ఆ అభిమాని ఎంతో మురిసిపోయాడు.

ఆ తర్వాత ఈ అభిమాని కుటుంబ సభ్యులందరూ కలిసి రానాతో ఫోటోలు దిగారు. ఈ స్వీట్ ఇంటరాక్షన్ కు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో రానా తమ అభిమానుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత చూసి చాలామంది ఫిదా అవుతున్నారు. ఈ వీడియోని ఈ లింక్ https://x.com/FilmyBowl/status/1825523791877009833పై క్లిక్ చేసి చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: