ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. తాజాగా ఈయన మిస్టర్ బచ్చన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన రామ్ పోతినేని మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

రామ్ పోతినేని కి కొంత కాలం క్రితం ఒక కథను వినిపించాను. అది చాలా సాఫ్ట్ గా వెళ్లే కథ. కనీసం ఆ సినిమాలో చెంప దెబ్బ కూడా ఉండదు. అలాంటి ఒక డిఫరెంట్ కథను నేను రామ్ పోతినేని కి వినిపించాను. ఆ కథ మొత్తం విన్న ఆయన కథ బాగానే ఉంది. కానీ మనిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే ఫ్యాన్ ఐదు లో తిరగాలి. మీరు చెప్పిన కథ రెండులో మాత్రమే తిరుగుతుంది. ఐదు లో తిరిగే కథ తయారు చేయండి సార్ చేద్దాం అని అన్నాడు.

నిజం గానే నాకు అనిపించింది. రామ్ తో చేస్తే ఫ్యాన్ ఐదు లో తిరిగే సినిమానే చేయాలి అని. అందుకే ఆయనతో అప్పుడు సినిమా సెట్ కాలేదు. మరి కొన్ని రోజుల్లో ఆయనతో ప్యాన్ ఐదు లో తిరిగే సినిమా ఇస్తాను అని తాజాగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. రామ్ పోతినేని హీరోగా రూపొందిన డబల్ ఇస్మార్ట్ మూవీ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాలు రెండు ఒకే రోజు థియేటర్ లలో విడుదల అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: