పవన్కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదలవుతుందని ప్రేక్షకులు భావించినా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. అందులో డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ లో తన పార్ట్ కంప్లీట్ చేసిన పవన్.. హరిహర వీరమల్లు.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్‏లో పాల్గొంటున్నారు. అలాగే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు ఓజీ అని టైటిల్ పిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా అనౌన్స్ తోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు.సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఓజి" మూవీ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.అదేమిటంటే పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న స్పెషల్ ట్రీట్ రాబోతుందంటూ అభిమాని చేసిన పోస్ట్ కు ఆయన స్పందించారు. "బిగ్గెస్ట్ సిల్వర్ స్క్రీన్ స్ట్రోమ్ కు ముందు సైలెన్స్" ఉంటుంది త్వరలో కలుద్దాం. అని రాసుకొచ్చారు. దీంతో ఫస్ట్ సింగిల్ లేదా బిజిఎం తో గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.తమన్ ఇచ్చిన అప్డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.డైరెక్టర్ సుజిత్.. పవన్ కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.అతి త్వరలోనే ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని థమన్  పోస్ట్  తో అర్థమవుతుండగా ఓజీ ఫస్ట్ సింగిల్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ కూడా త్వరలో వస్తుందేమో చూడాల్సి ఉంది. ఓజీ ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ మొదలైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: