మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్య, కండరాల నొప్పి తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్నట్లు మలయాళ మీడియా పేర్కొంది. అయితే తాజా గా ఆయన హెల్త్‌కు సంబంధించి సదరు ఆస్పత్రికి చెందిన వైద్యులు చేసిన ప్రకటన వైరల్‌ అవుతోంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అస్వస్థత కు గురై కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడ గా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఆయ‌న‌ తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పుల తో ,వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ముఖ్యంగా రద్దీ ప్రదేశాలను నివారించేందుకు ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.ప్రస్తుతం ఈ హెల్త్ బులెటిన్ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కానీ దీనిపై అధికార ప్రకటన రాలేదు.మరోవైపు మోహన్ లాల్ అభిమానులు తమ హీరోకి ఏ ప్రమాదం జరగకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అన్నట్టు మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘బరోజ్‌’ అక్టోబరు 3న విడుదల కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం మోహన్‌లాల్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోలుకున్నాక ప్రమోషన్స్ లో జాయిన్ అవుతాను అని మోహన్ లాల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఈ చిత్రానికి సంబంధించి మోహన్‌ లాల్‌ శనివారం పోస్ట్‌ కూడా పెట్టారు. 'తన రహస్యాలను మీ అందరితో పంచుకోవడం కోసం 'బరోజ్‌' వచ్చేస్తున్నాడు. మీ అందరూ సిద్ధంగా ఉండండి" అని రాసుకొచ్చారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: