తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో సదా ఒకరు. ఈమె నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో సదా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇక తెలుగులో మాత్రమే కాకుండా ఈమెకు తమిళ సినీ పరిశ్రమ నుండి కూడా అవకాశాలు దక్కడం మొదలు అయింది. 

అందులో భాగంగా ఈమె విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన అపరిచితుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. దానితో ఈమె ఇటు తెలుగు , అటు తమిళ సినీ పరిశ్రమలలో చాలా కాలం పాటు అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈమెకు సినిమా అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దానితో ఈ బ్యూటీ టీవీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ కాలాన్ని ముందుకు సాగిస్తోంది.

ఇకపోతే సినిమాల్లో ఈమె ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుందో అప్పుడప్పుడు ఈమె సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదే స్థాయిలో ఆరబోస్తోంది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇకపోతే ఈమె కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: