మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ నటుడు మలయాళ సినిమాలతో పాటు ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈయన మొదటగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన మహానటి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఈయన నటనకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నటుడికి ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ సీత రామం అనే మరో తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఈయన క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఇదే తేదీన ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు మూవీ బృందం వారు ప్రకటించారు. దానితో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అని చాలా మంది అంచనా వేశారు. ఇక అందరి అంచనాల ప్రకారం ఈ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: