యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని తారక్ దేవర మూవీ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది. కొరటాల శివ కంప్లీట్ గా తన రెగ్యులర్ ఫార్ములాని పక్కనపెట్టి ఫిక్షనల్ స్టోరీ లైన్ తో దేవర మూవీ చేస్తున్నారు.దేవర' సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే జూ ఎన్టీఆర్ తన వంతు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక సినిమా నుంచి వస్తున్న ఒక్కో సాంగ్‌కి నందమూరి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే ఆ రేంజ్‌లో ఉన్నాయి సాంగ్స్. మొదట వచ్చిన ఫియర్ సాంగ్, మొన్న వచ్చిన చుట్టుమల్లే పాట ఇప్పటికే రికార్డు వ్యూస్ సాధించాయి. దీంతో థర్డ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలో దేవర థర్డ్ సింగిల్ అంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దేవర మూవీ ఆయుధ పూజ సాంగ్ నుంచి 25సెకన్ల మ్యూజిక్ బిట్ లీక్ అంటూ ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో కారణంగా ఇంట్రస్టింగ్ టాక్ ట్రెండ్ అవుతోంది.దీని పై ఇంకా మూవీ టీమ్ స్పందించలేదు. ఈ బీజీమ్ అదిరిపోఇందింటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బీటు సినిమాలో ఆయుధ పూజ సాగే సమయంలో వచ్చే పాట అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సీన్ షూట్ కంప్లీట్ అయింది. ఆ సమయంలో రికార్డ్ చేసిన ఆడియో క్లిప్‌యే ఇదంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ పాట విన్న ఫ్యాన్స్ థియేటర్లో ఊగిపోవడం ఖాయమంటూ కామెంట్లు పెడుతున్నారు.

అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్‌కి థియేటర్లో నందమూరి ఫ్యాన్స్‌కి పూనకాలే అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే దేవర సినిమాకి లీకుల బెడద మాత్రం తప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు ఇది రిపీట్ అయింది. గోవా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ వీడియో రెండు సార్లు లీకైపోయింది. అలానే ఇప్పుడు పాట కూడా ముందే వచ్చేసింది.మొత్తం రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ముందుగా దసరాకి రావాలనుకున్న దేవర.. ఓజీ పోస్ట్ పోన్ అవడంతో సెప్టెంబర్ 27కి ఫిక్స్ అయిపోయింది. దేవర ప్రీ పోన్ అవడంతో ఆ తేదీలో రజినీకాంత్ వేట్టయాన్, సూర్య కంగువ పోటీ పడుతున్నాయి. ఇలా దసరాకి బాక్సాఫీస్ దగ్గర మాములు సందడి లేదు.ఇక దేవర సినిమా పూర్తి కావడంతో వార్ 2 షూటింగ్‌పై దృష్టి పెట్టారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కోసం రెడీ అవ్వబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 31 పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే ఫ్యాన్స్ కిక్కే కిక్కులా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: