ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా కొన్ని సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. ఈ సంవత్సరం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి సందర్భంగా ఒక తమిళ సినిమా మరియు రెండు తెలుగు సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోయే రెండు తెలుగు సినిమాలు కూడా చిన్న సినిమాలే కావడం వల్ల తెలుగు సినిమాల సందడి ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కనిపించే అవకాశాలు లేకుండా పోయాయి. మరి ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏ సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మొదటగా సెప్టెంబర్ 5 వ తేదీన తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా గోట్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నాయి.

సుహాస్ హీరో గా రూపొందిన జనక అయితే గనక సినిమా ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన భలే ఉన్నాడే సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద స్థాయి అంచనాలు లేవు.

ఇలా ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోయే సినిమాలలో తెలుగు నుండి రెండు చిన్న సినిమాలు ఉన్నాయి. ఇక తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి గోట్ మూవీ పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద స్థాయి అంచనాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: