ఒక సినిమాకు మంచి కలెక్షన్లు రావాలి అంటే ప్రమోషన్లు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. సినిమాను ఎంత బాగా తీశామో అనేది కాదు. ఆ సినిమాని జనాల దగ్గరకు ఎంత బాగా తీసుకెళ్లాము అనేది ముఖ్యమైన పాయింట్. కొంత మంది సినిమాను అద్భుతంగా తీసిన ప్రమోషన్లు చేయకపోవడం వల్ల సినిమా జనాల దగ్గరికి వెళ్ళక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు రావు. ఇక మరి కొంత మంది సినిమాను యావరేజ్ గా తీసిన మంచి ప్రమోషన్లు చేసి మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతూ ఉంటారు. కొంతమంది సినిమా విడతలకు ముందు మాత్రమే కాకుండా సినిమా విడుదల తర్వాత కూడా భారీ ఎత్తున ప్రచారాలను చేస్తూ ఉంటారు. 

కానీ సినిమా విడుదల అయిన తర్వాత మూవీ కి ఫ్లాప్ టాక్ వచ్చినట్లు అయితే ప్రచారాలను ఎక్కువ శాతం చేయరు. ఎందుకంటే ప్లాప్ టాక్ వచ్చాక ప్రచారాలను చేసిన పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి. ఇకపోతే ఆగస్టు 15 వ తేదీన రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ మూవీ , రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ మూవీ లు విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ రెండు మూవీ లకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో డబల్ ఇస్మార్ట్ మూవీ యూనిట్ పెద్దగా ప్రచారాలను చేయడం లేదు. మిస్టర్ బచ్చన్ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రచారాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. సినిమా విడుదల అయిన తర్వాత నెగటివ్ టాక్ వచ్చి విజయాలను అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి కోవకే ఈ సినిమా కూడా వస్తుంది అనే ధైర్యంతో ఈయన ప్రచారాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి హరీష్ శంకర్ ప్లాన్ పాలించి ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రాబోయే రోజుల్లో వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: