సంగీత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్‌ ఇండస్ట్రీలో పాపులర్‌ హీరోయిన్‌గా కొనసాగారు.ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో త‌న ఇన్నోసెంట్ ఫేస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో చెద‌ర‌ని ముద్ర వేసింది న‌టి సంగీత. ఈ న‌టి ఒక‌ప్ప‌డు ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్ప‌టి స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించారు ఈ అమ్మ‌డు.సంగీత1997 లో సురేష్ గోపి హీరోగా  మలయాళంలో తెరకెక్కిన గంగోత్రి ద్వారా సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టింది. అదే సంవత్సరం అలీ హీరోగా వచ్చిన  సర్కస్  సత్తిపండు ద్వారా తెలుగు తెరకు  పరిచయం అయ్యింది.  జగపతి బాబు, శ్రీకాంత్, రవితేజ వంటి స్టార్స్ సరసన చేసి మంచి నటిగా గుర్తింపు పొందింది. తమిళంలో కూడా సుమారు  పది సినిమాల దాకా చేసింది. విక్రమ్ ,సూర్య ల పితామగన్ అయితే సంగీతకి ఎనలేని కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెట్టింది.ఆ మూవీ  శివ పుత్రుడు గా  తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.న‌టి సంగీత ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేశారు. ఇక‌, పెళ్లి త‌ర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మ‌ధ్య‌కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈ న‌టి త‌మిళ ఇండ‌స్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 తనకు తమిళ ఇండ‌స్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారని అన్నారు.'ఇక‌, త‌మిళ ఇండ‌స్ట్రీ విష‌యానికొస్తే.. తమిళంలో కొంత‌మంది అవకాశాల కోసం ఫోన్‌ చేసి మర్యాద, గౌర‌వం లేకుండా మాట్లాడతారు. వారే నాకు జీవితాన్ని ప్రసాదిస్తున్న‌ట్లు వ్యవహరిస్తారు. నేను కరెంట్‌ బిల్లు కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు మాట్లాడుతారు. నాకు పారితోషికం ఎంతివ్వాలి అని కూడా వారే నిర్ణ‌యం తీసుకుంటారు. న‌న్ను కేవ‌లం న‌టించ వెళ్లమంటారు. వారికి నేను గౌర‌వం, మ‌ర్యాద ఇవ్వాలనుకుంటున్నాను కానీ, వాళ్లు నాకు ఇవ్వరు. అందుకే తమిళ్ సినిమాల్లో పెద్దగా నటించను' అని సంగీత అన్నారు. ప్ర‌స్తుతం ఈ న‌టి చేసిన వ్యాఖ్య‌లు కాస్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మాట‌లు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ విష‌యాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే, నేను చెప్పేది నిజం. తమిళ సినిమాల్లో న‌టించేట‌ప్ప‌డు నాకు సరైన గౌరవం, మర్యాద అనేవి ఉండేవి కావు. తమిళ సినిమాల్లో అవ‌కాశాలు కావాల‌ని నేను ఎవ‌రీని అడిగింది లేదు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో నాకు అవకాశాలు రావ‌డంతోపాటు ఆదరణ కూడా ల‌భించేది. అంతేకాదు, మంచి పారితోషికం కూడా ల‌భిస్తుంది' అని న‌టి సంగీత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: