సమంత గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. ఎప్పుడైతే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే అప్పటి నుండి సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో ఉన్న ఫోటోలు మీడియా లో ఎక్కువ గా కనిపిస్తున్నాయి. అయితే అప్పటి వరకు ఈ ఫోటోలు ఎక్కడ కూడా బయటపడలేదు. కానీ సడన్ గా ఈ ఫోటోలు సోషల్ మీడియా లో కనిపించే సరికి చాలామంది జనాలు ఇదేంటి ఇన్ని రోజులు ఈ ఫోటోలన్నీ ఎక్కడికి పోయాయి.. ఇన్ని రోజులుగా లేని ఫోటోలు ఇప్పుడే ఎందుకు సోషల్ మీడియా లో ఇంత ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అని చాలామంది ఆశ్చర్యపోయారు. 

అంతేకాదు సమంత డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ చేస్తుందని, ఆయన్ని త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటుందని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లు వినిపించిన వేళ తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ ఖాతా లో ఒక పోస్ట్ పెట్టింది అదేంటంటే.." serving up something special today stay tuned" అంటే..ఈ రోజు ఒక స్పెషల్ విషయాన్ని చెబుతాను.. అందరు వేచి చూడండి అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ చేసింది సమంత.. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ సమంత ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతుందా.. నాగ చైతన్య లాగే సమంత కూడా రెండో పెళ్ళికి రెడీ అయ్యాను అనే విషయాన్ని చెప్పబోతుందా..

 లేదా తన కొత్త సినిమాకి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందా..అని చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సమంత చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో మరికొద్ది గంటల్లో తెలియబోతుంది.ఏది ఏమైనప్పటికీ సమంత పెట్టిన పోస్ట్ చూసిన చాలామంది ఆమె అభిమానులు సమంత కూడా నాగచైతన్య లాగే తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: