మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే సంగతి మనకు తెలిసిందే.అయితే మెగాస్టార్ చిరంజీవి తన అసలు పేరుని వదిలిపెట్టి చిరంజీవి అనే పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటి.. ఓ అమ్మాయి కారణంగానే తన పేరు చిరంజీవిగా మార్చుకున్నారట. మరి దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా ఎలా మారారంటే..చిరంజీవి ఓ రోజు శ్రీరాములవారి గర్భగుడి దగ్గర పడుకొని పూర్తి నిద్రలోకి జారిపోయారట. అయితే ఆ నిద్రలోకి ఒక పదేళ్ల అమ్మాయి వచ్చి గుడిలో ఏంటి చిరంజీవి అలా పడుకున్నావ్ లేవు ఎంత సమయం అయింది చూడు లేచి అని చెప్పిందట. 

అయితే అప్పటికీ చిరంజీవి ఇంకా కలలోనే ఉన్నాడు.అయితే ఆ అమ్మాయి తన పేరు శివశంకర్ అయితే చిరంజీవి అని ఎందుకు పిలిచింది అనే ఆలోచనలో చిరంజీవి మునిగిపోయారట. ఇక తర్వాత నేనంటి రాములవారి గుడిలో ఉన్నాను అని ఆలోచించేలోపే బయటి నుండి చిరంజీవి ఫ్రెండ్ ఒరేయ్ చిరంజీవి రా తొందరగా వెళ్దాం అనే పిలుపు కూడా వినిపించిందట. అయితే ఈ పిలుపులన్నీ చిరంజీవికి కలలోనే వినిపిస్తున్నాయి. అలా టక్కున లేచి కూర్చునేసరికి ఇదేంటి నన్ను చిరంజీవి అని పిలిచినట్టు ఆ పేరు కలలో వచ్చింది.అసలు ఇప్పటివరకు నాకు చిరంజీవి అనే పేరు కూడా తెలియదు.

అలాంటిది వాళ్ళు ఎందుకు నా కలలో చిరంజీవి అని పిలిచారు అని అయోమయంలో చిరంజీవి ఇంటికి వెళ్లి తన తల్లి అంజనమ్మకు ఈ విషయం చెప్పాడట. దాంతో అంజనమ్మ కూడా సంతోషించి ఈ పేరు బాగుంది.స్క్రీన్ మీద ఇదే పేరు పెట్టుకుంటే మంచిది అని చెప్పడంతో సినిమాల్లోకి వెళ్లిన చిరంజీవి మీ పేరేంటి అని అడగగా.. వెంటనే చిరంజీవి అని చెప్పారట. అలా కొణిదెల శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారిపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి: