పై ఫోటోలో పెళ్లికూతురు అవతారంలో ఉన్న ఓ బాలికను చూశారా? ఈ బాలిక ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతానికి అయితే ఎక్కువ సినిమాల్లో నటించలేదు కానీ ముద్దుగుమ్మకు నటన అంటే పిచ్చి అందుకే అయిపోయింది సాఫ్ట్‌వేర్‌ జాబ్ వదిలేసి మరీ ఇండస్ట్రీలోకి జంప్ చేసింది. ఈ అమ్మడు చాలా అందంగాకు ఉంటుంది పైగా బాగా నటిస్తుంది కాబట్టి త్వరగానే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫ్లాట్ అయిపోయారు. అయితే సాధారణంగా మూవీ ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ సాధించిన వెంటనే ఎవరు పెళ్లి చేసుకోరు కానీ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి పీటలు ఎక్కబోతోంది. అది కూడా తన ప్రియుడితో! ఆ ప్రియుడు కూడా హీరో కావడం విశేషం.

 తొలి సినిమాలో రొమాన్స్ చేసిన హీరోతోనే ఆమె పెళ్లి జరగనుంది. ఆమె ఫస్ట్ మూవీ చేస్తూ అతడితో ప్రేమలో పడిపోయింది. సినిమా చాలా ఏళ్ల క్రితం వచ్చింది. వీరిద్దరూ సినిమా సెట్స్ లో ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి బాగా ప్రేమించుకుంటున్నారు. అయితే దాన్ని బయట పెట్టకుండా ఐదేళ్లపాటు సీక్రెట్ గా ఉంచారు. ఇటీవలే పెద్దలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. దాంతో ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ హీరో హీరోయిన్లు ఎవరో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాం. అదేనండి ‘రాజావారు రాణిగారు’ సినిమాలో హీరో హీరోయిన్లుగా రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరం. వీరిద్దరూ ఈ సినిమా షూటింగ్స్ లో ఒకరికి ఒకరు బాగా క్లోజ్ అయ్యారు తర్వాత ప్రేమలో పడ్డారు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో వీరిద్దరి పెళ్లి వేడుకలు ఆగస్టు 22న చాలా ఘనంగా జరగనున్నట్టు సమాచారం. రహస్య గోరఖ్‌, కిరణ్ అబ్బవరం వెడ్డింగ్ అప్‌డేట్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అతడి, ఆమె చిన్ననాటి ఫోటోలు కూడా పైన ఉన్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కిరణ్, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే అయినా సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. “రాజవారు రాణిగారు” సినిమాతో హీరోగా, హీరోయిన్‌గా పరిచయమైన వీరిద్దరూ ఆన్‌స్క్రీన్‌పై బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ రియల్ లైఫ్ లోనూ భార్యాభర్తలు కాబోతున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న కిరణ్ మార్చి 13న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రేమతో తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: