ఈ క్యారెక్టర్ ముందుగా అలనాటి, దివంగత నటి శ్రీదేవి వద్దకు వచ్చింది. రాజమౌళి శ్రీదేవిని పిలిచి మరీ సినిమా స్టోరీ అంతా చెప్పి ప్రభాస్ తల్లి క్యారెక్టర్ చేయాలి అని అడిగారట. ఈ సినిమా తీసేనాటికే శ్రీదేవి హాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా పాపులర్ అయింది ఆమెను తీసుకుంటే హిందీలో మూవీకి మంచి పాపులారిటీ వస్తుందని రాజమౌళి భావించారు అందుకే ఆమెకు మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ ని ఆఫర్ చేశాడు. కానీ శ్రీదేవి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెబుతూ ఈ క్యారెక్టర్ ని సింపుల్ గా రిజెక్ట్ చేసిందట.
బాహుబలి సినిమాలో చేయడానికి శ్రీదేవి ఏకంగా రూ.8 కోట్లు ఇవ్వాలని అడిగిందట. అంతేకాదండోయ్ సినిమాలో షేర్ కూడా కావాలన్నదట. ఇవే కాకుండా తన హోటల్ బిల్లులు, విమాన టికెట్ ఛార్జ్‌లు అన్నీ భరించాలని చెప్పిందట ఆ లెక్కన ఆమెకు ఒక్కదానికే రూ.15 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని నిర్మాత భయపడ్డాడట. ఇదే విషయం రాజమౌళికి ప్రొడ్యూసర్ చెప్పాడట. దాంతో కంగుతున్న రాజమౌళి మళ్లీ ఆమెను కన్సల్ట్ కాకుండా ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను సెలెక్ట్ చేసుకున్నారని అంటారు.
బాహుబలి సినిమాని చాలా బడ్జెట్ అద్భుతంగా తీశారు. విజువల్ వండర్ కావాలనే ఉద్దేశంతో మిగతా ఖర్చులన్నీ తగ్గించుకున్నారు. అలాంటి సమయంలో శ్రీదేవి వచ్చి 15 కోట్లు ఇవ్వాలని అనడంతో బడ్జెట్ కేటాయింపు ప్లాన్ చెడిపోతుందని ఆమెను వద్దనుకున్నారట. అయితే ఆమె డబ్బులు డిమాండ్ చేయడం నిజమో కాదో తెలియదు కానీ శ్రీదేవి పై చాలా విమర్శలు వచ్చాయి. బంగారం లాంటి అవకాశాన్ని శ్రీదేవి కాళ్ళదన్నుకుంది అని చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఆ సమయంలో ఆమె పెదవి విప్పింది. తాను ఎప్పుడూ డబ్బులు డిమాండ్ చేయలేదని, నిర్మాత రాజమౌళికి అబద్ధం చెప్పి ఉంటాడని ఆమె ఒక వివరణ ఇచ్చుకుంది.