ఇప్పటికే దర్శక నిర్మాతలు టాలీవుడ్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అభిషేక్ అగర్వాల్, శ్రీనివాస్ కుమార్ కూడా బాలీవుడ్ నటుడుకి కౌంటర్లు ఇచ్చారు. తాజాగా హీరో సుధీర్ బాబు కూడా బాలీవుడ్ నటుడు చీప్ కామెంట్స్ పై స్పందించడం గమనార్హం. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అర్షద్ వార్సీ కి కౌంటర్ గా.. నిర్మాణాత్మకంగా విమర్శిస్తే పర్వాలేదు కానీ ఇలా చులకన చేసి కించపరిచేలా మాట్లాడడం పద్ధతి కాదు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్ అర్షద్ వార్సీ నుంచి వస్తాయని నేను అసలు ఊహించలేదు. ప్రభాస్ స్థాయి ఎంతో పెద్దది.. కుంచిత మనస్తత్వంతో చేసే వ్యాఖ్యలను ఆయన ఎప్పుడూ కూడా పట్టించుకోరు అంటూ సుధీర్ బాబు తన ట్వీట్ ద్వారా రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ చాలా వైరల్ గా మారుతుంది అంతేకాదు ఈ ట్వీట్ ను ప్రభాస్ అభిమానులు వైరల్ చేస్తూ షేర్, లైక్ చేస్తూ.. చాలా బాగా చెప్పావు అన్న ప్రభాస్ గురించి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ప్రభాస్ ను విమర్శించిన అర్షద్ వార్సీ పై చాలామంది హీరోలు ఒక్కొక్కరిగా మండిపడుతూ ప్రభాస్ పై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు.