తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో చిరంజీవి పేజీ టాప్‌లో ఉంటుంది. ఇప్పటి తరానికి మెగాస్టార్ రేంజ్‌ గురించి పెద్దగా తెలియదు కానీ… అసలు ఒక దశాబ్దంన్నర కాలం కిందట, ఆయన క్రేజ్‌కు ఇండియన్ సినిమానే తలొంచింది.దసరా, సంక్రాంతి పండగలు వస్తున్నాయంటే మనం ఎంత సందడి చేస్తుంటామో…అసలు అప్పట్లో.. చిరంజీవి సినిమాలు రిలీజవుతున్నాయంటే ఆ పండగలను మించిన సెలబ్రేషన్స్ చేస్తుంటాం. చిరంజీవి సినిమా రిలీజవుతుందంటే వారం ముందు నుంచే సెలబ్రేషన్స్ రచ్చ షురూ అవుతుంది.చిరంజీవి… సినిమా స్టైల్‌లో చెప్పాలంటే, ఈ పేరు వింటుంటే ఉరుములు, మెరుపులు సైతం దద్దరిల్లిపోతాయి. అసలు మెగాస్టార్ అంటే ఒక శిఖరం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్‌లో ఏకచక్రాధిపత్యం కొనసాగించాడు.ఇక ఆ తరానికి, ఈ తరానికి అని కాకుండా… అన్ని తరాల వారికి చిరంజీవి మేనియా గురించి తెలిసేలా చేసిన ఇంద్ర. అసలు ఇంద్ర సినిమా నెలకొల్పిన రికార్డుల గురించి ఒక పుస్తకమే రాయోచ్చు.అసలు రిలీజ్ టైమ్‌లో ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా ఇంతా కాదు. బి.గోపాల్ మేకింగ్, చిరంజీవి టెర్రిఫిక్ యాక్టింగ్, సీట్లో కూర్చోనియకుండా చేసిన మణిశర్మ పాటలు. ఈలలు వేయించే ఫైట్స్… అబ్బబ్బ, అసలు థియేటర్‌లో ఈ సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేసిన వాళ్ళంత అదృష్ట వంతులు ఎవరు ఉండరేమో.

ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకి అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు. అందులో చిరుకి పద్మవిభూషణ్ వచ్చిన ఏడాది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన ఏడాది కావడంతో ఈసారి సంబరాలు అంబరాన్నంటేలా ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. పైగా థియేటర్లో కూడా మెగా సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చిరు కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అయిన 'ఇంద్ర' సినిమాను ఆగస్టు 22న రీరిలీజ్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. మరి ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం గురించి చూద్దాం.ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. "ఇంద్ర సినిమా సమయంలో డైరెక్టర్ బీ గోపాల్ గారు జూ ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా సాంగ్స్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. అప్పుడు ఇంద్ర సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు. ఫ్లాష్ బ్యాక్‌లో హోమం సీన్, సాంగ్ ఆ ఎపిసోడ్స్ అన్నీ చిరునే డైరెక్ట్ చేశారు. ఆ ఎపిసోడ్స్‌లో నేను లేను కానీ షూటింగ్ టైమ్‌లో అక్కడే ఉన్నాను." అంటూ రాజా చెప్పారు.నిజానికి ఇంద్ర సినిమాలో ఫ్లాష్ బాక్ సీన్లు చాలా హైలెట్‌గా ఉంటాయి. సినిమా విజయంలో అవే కీలకపాత్ర పోషించాయి. అసలు ఆ హోమం సీన్, మొక్కే కదా అని పీకెస్తే పీక కోస్తా అనే డైలాగ్ వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లకి థియేటర్లు దద్దరిల్లాయి. అలాంటి బ్లాక్ బస్టర్ సీన్లను చిరు డైరెక్ట్ చేశారని తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: