ఒకవైపు హీరోగా , విలన్గా  పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు హీరో విజయ్ సేతుపతి.. తమిళంలో హీరోగా సక్సెస్ అయినా ఈ నటుడు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఈయన నటించిన మహారాజ సినిమా ఇటీవల విడుదలై భారీ కలెక్షన్స్ను సాధించింది. జులై 14న ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా డైరెక్టర్ నితిన్ స్వామినాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విజయ్ సేతుపతి 50వ సినిమాగా విడుదల చేశారు.


ఇందులో చాలామంది నటీనటులు కూడా నటించారు. థియేటర్లో సక్సెస్ఫుల్గా విజయాన్ని అందుకున్న మహారాజ సినిమా జూలై 14న ఓటీటిలో విడుదలై భారీగానే ఆదరణ లభించింది. తెలుగు, తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మహారాజ సినిమా 2024 లోనే అత్యధికంగా సాధించిన టాప్ 10 చిత్రాలలో  తమిళ చిత్రం మహారాజ సినిమా ఒక్కటి మాత్రమే అవకాశం లభించింది. నెట్ ఫ్లిక్ లో ఈ సినిమా స్ట్రిమ్మింగ్ అవుతున్నది. మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.18.6 మిలియన్ వ్యూస్ నీ దక్కించుకున్నదట మహారాజా చిత్రం.


తమిళ సినిమాకు దక్కిన అతిపెద్ద గౌరవం ఇది అని చెప్పవచ్చు. అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తూ విజయ్ సేతుపతి పై ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. మహారాజ సినిమా బేసిక్ లైంగిక వేధింపుల ఘటనకు గురైన కూతురు.. తన కూతుర్ని అలా చేసిన తండ్రి ఎలా పగ తీర్చుకున్నారు అని సినిమా కదా అంశంతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా చివరిలో టూరిస్ట్ అందరిని ఆకట్టుకుంది. మొదట తమిళ సినీ ఇండస్ట్రీల చిన్నచిన్న పాత్రలలో మెప్పించిన విజయ్ సేతుపతి 2010 లో వచ్చిన తెన్మెచ్చు బరుకట్టు సినిమాతో హీరోగా మారారు. తెలుగులో బాలీవుడ్ లో నటిస్తూ మరింత క్రియల సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. రాబోయే రోజుల బిగ్ బాస్ కి హోస్టుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: