మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి కంగనా రణౌత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈమె సినిమాలతో పాటు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టింది.

అందులో భాగంగా కొంత కాలం క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బి జె పి పార్టీ అభ్యర్థిగా ఎంపీ గా పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఎంపీ గా విజయం సాధించింది. ఇకపోతే ఈమె తాజాగా ఎమర్జెన్సీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటుంది.

తాజాగా ఈ బ్యూటీసినిమా ప్రమోషన్ లకి ఐవరీ కలర్ టిష్యూ శారీలో వచ్చింది. ఇకపోతే ఈసారి లో కంగనా రనౌత్ ఎంతో అందంగా ఉంది. ఇక ఈమె చీరకు తగిన బ్లౌజ్ నీ కూడా ధరించి ఎంతో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉంది. దానితో ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీరకట్టులో అందుకు తగిన బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ రోజు కంగనా కట్టుకున్న చీర చాలా సింపుల్ గానే కనిపించిన దీని ధర మాత్రం భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. కంగనా ఈ రోజు కట్టుకున్న చీర ధర 48,995 రూపాయలు అని తెలుస్తుంది. ఇలా కంగనా కాస్ట్లీ చీరలో క్లాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: