కోలీవుడ్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది. అందుకే ఈయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు.. ఇటివలె విజయ్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ది గోట్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా విడుదల కాగా చాలా దారుణమైన ట్రోల్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. విజయ్ అభిమానులను అయితే ఈ ట్రైలర్ మెప్పిస్తోంది.


డైరెక్టర్ వెంకట ప్రభు యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో ప్రశాంత్, ప్రభుదేవా ,లయ, స్నేహ, మీనాక్షి చౌదరి తదితర నటి నటులు సైతం నటిస్తూ ఉన్నారు. డ్యూయల్ పాత్రలో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇదంతా ఇలా ఉండగా గోట్ సినిమాలో ఊహించని సర్ప్రైజ్ ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కూడా ఇందులో కనిపించబోతున్నట్లు సమాచారం.


ఇటీ వలె విడుదలైన ట్రైలర్లో మహేంద్ర సింగ్ ధోని రిఫరెన్సులు చాలా ఉన్నాయని ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకట ప్రభు కూడా తెలియజేశారట. అయితే ఈ సినిమాలో ధోని కూడా కనిపించబోతున్నాడని కోలీవుడ్ మీడియాలో చాలా గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు హీరో విజయ్ దళపతితో ధోనీ  కలిసి ఉన్న ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతున్నది. దీంతో అటు ధోని అభిమానులు దళపతి అభిమానులు సైతం ఈ ఫోటోలను తెల వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ధోని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలర్ ఫ్యాన్సీను రాబడుతుందనీ  అభిమానులు భావిస్తున్నారు.ప్రస్తుతమైతే గోట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నది. మరి అందరూ అనుకున్నట్టుగానే ధోని నటించారో లేదో మరో కొద్ది రోజులలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: