స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై గత కొంతకాలంగా చాలామంది ఆయనను ట్రోల్ చేస్తూ ఉండడమే కాకుండా విమర్శిస్తూ ఉన్నారు. పుష్ప-2 సినిమా విషయంలో కూడా చాలామంది భయపడే వెనకడుగు వేస్తున్నారనే విధంగా కామెంట్స్ చేయడం జరిగింది. ఇలా అన్ని విషయాలకు సైతం నిన్నటి రోజున ఒక సినిమా ఈవెంట్లో పులిస్టాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


సుకుమార్ భార్య తబిత సుకుమార్ అండదండలతో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం గెస్ట్ గా వచ్చారు అల్లు అర్జున్. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఒక సంచలనాన్ని రేపుతున్నాయి. ఈ మాటలు మానిపోతున్న పుండు పైన కారం చల్లినట్టుగా మారిపోయింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వైసిపి లీడర్ రవిచంద్ర రెడ్డి కోసం ప్రచారం చేయడంతో మెగా అభిమానులు, అల్లుఅర్జున్ ని చాలా దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా చాలామంది ఆయనను అవమానిస్తూ టీవీ డిబేట్లో కూడా మాట్లాడడం జరిగింది. దీంతో అల్లు అభిమానులు కూడా ఫైర్ అయ్యారు.


కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా నానా మాటలు అనడం జరిగింది. ఇలాంటి విషయం పైన మెగా కుటుంబం కూడా సైలెంట్ గా ఉండడంతో నిజంగానే అల్లు కుటుంబం మెగా కుటుంబం మధ్య వివాదాలు ఉన్నట్లుగా మరోసారి తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపేలా ఉన్నాయి.. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రస్తుతం పుష్ప-2 క్లైమాక్స్ జరుగుతోందని ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ తెలిపారు. చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నాను.. బయటికి రాలేని పరిస్థితి ఉందంటూ తెలిపారు.. కానీ సుకుమార్ భార్య తబిత మాత్రం నిన్ను కాకుండా ఎవరిని పిలవను నాకోసం నువ్వు రాకుండా ఎవరు వస్తారని చెప్పి అడిగిందట.. ఈ మాట అనడంతో తాను ఈవెంట్ కి వచ్చేసానని తెలిపారు అల్లు అర్జున్..


ఎందుకంటే ఇష్టమైన వాళ్లకోసం మనం ఉన్నామని చూపించాలి మనం నిలబడాలి.. మన ఫ్రెండ్ అనుకో, మనకు కావలసినవారు అనుకో, నాకు ఇష్టమైతేనే నేను వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తానంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ సైతం ఇచ్చారు అల్లు అర్జున్. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు అంటు తెలియజేశారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే విషయంపై అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైరయ్యారు తన భార్య ఫ్రెండు అయిన వైసీపీ నేతవైపు వెళ్లడంతో ఈ వివాదం తలెత్తింది. ఇన్ని రోజులు అందరూ చేసిన ట్రోల్స్ కు ఇప్పుడు పరోక్షంగా కూడా ఈవెంట్లో కౌంటర్ మెగా అభిమానులకు వేశారు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. డిసెంబర్ 6న తగ్గేదే లేదు అన్నట్లుగా తెలియజేస్తున్నారు అల్లు అర్జున్. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: