టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లతో పోల్చి చూస్తే సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడం విషయంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు కోహ్లీ. అందుకే కోహ్లీ గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ పేరు మరోసారి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అయితే ఈసారి కోహ్లీ గురించి కాదు కోహ్లీ భార్య అనుష్క శర్మ సోదరి రూహణి శర్మ గురించి.


 అనుష్క శర్మ సోదరి రూహణి శర్మ అటు సినిమా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఛిలాసౌ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. చిన్నచిత్రంగా వచ్చిన  ఈ మూవీ జాతియా అవార్డును సైతం గెలుచుకుంది. ఇక ఈ మూవీలో రూహణి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి హోమ్లీ  హీరోయిన్గా గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత హిట్, హర్, నూట ఒక్క జిల్లాల అందగాడు, శ్రీరంగనీతులు, సైంధవ వంటి సినిమాలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రకాలు మతిపోకూడదు పోగుడుతూ ఉంటుంది.


 అందరూ ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయని ఈ ముద్దుగుమ్మ  ఇప్పటికే రెండు హిందీ సినిమాలలో కూడా నటించి అభిమానులను సైతం నోరెళ్లపెట్టేలా చేసింది. అది సరేగాని ఇప్పుడు ఆమె ఎందుకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అనుకున్నారు కదా. రూహణి ఆగ్రా అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండడంతో విడుదలకు నోచుకోలేదు. అయితే ఇక ఇప్పుడు థియేటర్లోకి రాకముందు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఇందులో రూహణి మెయిన్ క్యారెక్టర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కేవలం హీరో కలలో వచ్చే అమ్మాయి పాత్రలో మాత్రమే నాలుగైదు నిమిషాలు కనిపిస్తుంది. ఇక ఇది మన దేశంలో కాదు అమెజాన్ ప్రైమ్ లో ఫ్రాన్స్ లో విడుదలైంది. టెలిగ్రామ్ సహా పలు వెబ్సైట్లను అందుబాటులో ఉంది ఈ మూవీ.

మరింత సమాచారం తెలుసుకోండి: