హీరో ని ప్రేమించా..కానీ చుక్కెదురైంది అంటూ ప్రభాస్ నటి తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంచలన విషయాలు బయట పెట్టింది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రభాస్ సరసన సాహో మూవీలో కథనాయికగా చేసిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ స్టార్ నటుడు శక్తి కపూర్ వారసురాలీగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ కపూర్ తాజాగా 2018లో విడుదలైన స్త్రీ మూవీ కి సీక్వెల్ గా స్త్రీ 2 అనే మూవీతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో పాటు ఎన్నో రికార్డులను తిరగరాసింది.దాంతో హీరోయిన్ అయినా కూడా హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అనే విధంగా తన రికార్డులతో బాలీవుడ్ లో మోత మోగిస్తుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.

నేను ఒకప్పుడు ఆ హీరోని ప్రేమించాను.కానీ రిజెక్ట్ చేశాడు అంటూ సరదాగా ఈ విషయాన్ని చెప్పింది.ఇక ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ దావన్.. శ్రద్ధా కపూర్ వరుణ్ ధావన్ ఇద్దరు కలిసి తమ ఫాదర్స్ చేసే సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారట.అయితే వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ స్టార్ డైరెక్టర్ అలాగే శక్తి కపూర్ స్టార్ నటుడు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిన సమయంలో వరుణ్, శ్రద్ధా ఇద్దరు షూటింగ్ స్పాట్లో కలుసుకున్నారట. ఇక ఆ సమయంలో శ్రద్ధా కపూర్ వరుణ్ కి ఫిదా అయ్యి  యూ లవ్ ఐ అనే పదాన్ని రివర్స్లో చెప్పమందట.

కానీ వరుణ్ మాత్రం నాకు అమ్మాయిలంటే అసహ్యం అని అక్కడి నుండి వెళ్లిపోయారట. అలా చిన్నతనంలోనే వరుణ్ కి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసాడు అంటూ ఈ ప్రమోషన్ ఈవెంట్లో ఫన్నీగా ఈ విషయాన్ని పంచుకుంది శ్రద్ధా కపూర్. అంతేకాదు ఈ విషయం ఇండస్ట్రీలోని చాలామందికి తెలుసు అని చెప్పింది. ఇక శ్రద్ధా కపూర్,వరుణ్ ధావన్ ల కాంబినేషన్లో ఏబిసిడి,స్ట్రీట్ డ్యాన్స్ 3డి అనే మూవీస్ వచ్చాయి.ఇక తాజాగా విడుదలైన స్త్రీ -2 మూవీలో వరుణ్ ధావన్ గెస్ట్ రోల్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: