తెలుగు సినీ పరిశ్రమకి తన స్వయం కృషితోనే పైకి వచ్చిన హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. సాధారణ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చి విలన్ గా హీరోగా పైకి ఎదిగారు చిరంజీవి. ఎంతోమందికి చిరంజీవి ఇన్స్పైర్గా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలామందే ఉన్నారు. ఎన్నో కష్టాలను తట్టుకొని ఆత్మవిశ్వాసంతో ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఈరోజు పుట్టినరోజు కావడం చేత అభిమానులు ఫుల్ ఖుషి చేస్తున్నారు. 1978లో మొదటిసారి పునాదిరాళ్లు అనే సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టారు. కానీ ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది



చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. వాటిని తట్టుకోలేక మళ్ళీ రాజకీయాల నుంచి బయటికి వచ్చి ఖైదీ-150 చిత్రంతో రియంట్రీ ఇచ్చారు. దాదాపుగా మెగాస్టార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 46 ఏళ్ల సినీ ప్రస్తానమని చెప్పవచ్చు. చిరంజీవి అందుకున్న రికార్డ్స్ ఏమిటంటే.


1).1999-2000 సంవత్సరంలో అత్యధికంగా పన్ను చెల్లించిన హీరోగా సన్మాన అవార్డుని అందుకున్నారట.


2). చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ లోకి డబ్బింగ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే.


3). చిరంజీవి బావగారు బాగున్నారా సినిమా కోసం 240 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేశారు.. ఈ సన్నివేశాన్ని సినిమా అయిపోయిన తర్వాత కూడా చూపిస్తారు.

4). చిరంజీవి చేసిన హీరోగ చేసిన చిత్రాలు వంద రోజులు ఆడినవి చాలానే ఉన్నాయి.


5). ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషకం అందుకున్న మొదటి భారతీయుడుగా పేరుపొందారు మొదటిసారి కోటి రూపాయలు 1992లో అందుకున్నారట.


6). ఘరానా మొగుడు రూ .10 కోట్ల రూపాయలు రాబట్టిన మొట్టమొదటి చిత్రం గా చిరంజీవికి అందుకుంది.


7). తనకంటూ ఒక పర్సనల్ వెబ్సైట్ ని కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ హీరోగా మాత్రమే చిరంజీవికి ఇది సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: