కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో విక్రమ్ ఒకరు. విక్రమ్ కెరియర్లో భారీ విజయాలు ఎక్కువ లేకపోయిన ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ హీరోకి ఫ్లాప్ లు వచ్చినా కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలలో నటించకుండా ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటంతో విక్రమ్ కి ఒక ప్రత్యేకమైన ఈమేజ్ ఉంది. ఇకపోతే విక్రమ్ హీరో గా రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దానితో తమిళ ఇండస్ట్రీ తర్వాత విక్రమ్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దానితో ఈయన దాదాపు తాను నటించిన ప్రతి సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. తాజాగా విక్రమ్ తంగలాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రావడంతో ప్రస్తుతం ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే తంగలాన్ మూవీ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న విక్రమ్ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

విక్రమ్ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మురుగదాస్ ఓ స్టోరీని విక్రమ్ కు వినిపించగా అది బాగా నచ్చడంతో విక్రమ్ , మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే మురుగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ఓ మూవీ ని , సల్మాన్ ఖాన్ హీరో గా సికిందర్ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత విక్రమ్ తో సినిమా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: