మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈరోజు .. ఈ సందర్భంగా చిరంజీవి నటిస్తున్న  విశ్వంభర సినిమా నుంచి ఒక పోస్టర్ ను  రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే ఉదయం ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో కొత్త పోస్టర్ ను  విడుదల చేశారు చిత్ర బృందం. ప్రస్తుతం చిరంజీవి యువి క్రియేషన్స్ బ్యానర్ లో డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంటుతో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. త్రిష , ఆషికా  రంగనాథ్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా.. మరింత మంది స్టార్స్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి బర్త్డే సందర్భంగా చిరంజీవి  ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ ఇప్పుడు కొత్త పోస్టర్ విడుదలయింది.  ఈ పోస్టర్లో చిరంజీవి త్రిశూలం, పట్టుకుని ఒక భారీ కొండపై కొత్త లోకంలోకి వెళ్తున్నట్లు మనం చూడవచ్చు.

ముఖ్యంగా పోస్టర్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. ఈ పోస్టర్ చూస్తేనే దానికి తగ్గట్టు ఉండబోతోంది అని తెలుస్తోంది. మొత్తానికి అయితే మెగాస్టార్ పుట్టిన రోజు నాడు పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ పోస్టర్ కాస్త చాలా వైరల్ గా మారింది.ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 2వ తేదీన విడుదల కాబోతోంది. మరి చిరంజీవి సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక మెగాస్టార్ చిరంజీవి వస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని నేడు మెగాస్టార్ గా మంచి గుర్తింపు అందుకున్నారు. దీనికి తోడు ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు తండ్రి కొడుకులు వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: