సినీ పరిశ్రమ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్థాయి కి వెళుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిన వారు కూడా కొంత మంది కేవలం ఒక్క మూవీ తోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతూ ఉంటారు. అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు ఉన్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత "ఏం మాయ చేసావే" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తోనే సమంత కు అద్భుతమైన విజయం , సూపర్ క్రేజ్ వచ్చాయి. దానితో ఈ నటి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది.

మోస్ట్ బ్యూటిఫుల్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తో ఈ బ్యూటీ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ లీల , రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ మూవీ తో ఈ బ్యూటీ కి అద్భుతమైన క్రేజ్ రావడంతో ఈ సినిమాతో ఈమెకు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చేసింది.

అనుష్క శెట్టి "సూపర్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకున్న ఈ మూవీ లో అనుష్క తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ఈమేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: