తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి మణులతో సమంత ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. మొదటగా జూనియర్ ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్ లో బృందావనం అనే మూవీ వచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో రామయ్య వస్తావయ్య , రభస సినిమాలు వచ్చాయి. ఈ రెండు మూవీ లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ తర్వాత వీరి కాంబోలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది.

ఇకపోతే ఇప్పటి వరకు ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్ లో 4 సినిమాలు రాగా 4 మూవీలలో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏమిటి అనుకుంటున్నారా ..? ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా బృందావనం లో సమంత తో పాటు కాజల్ కూడా హీరోయిన్ గా నటించింది. ఇక ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా రామయ్య వస్తావయ్య సినిమాలో సమంత తో పాటు శృతి హాసన్ కూడా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇక ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా రభస లో సమంత తో పాటు ప్రణీత కూడా హీరోయిన్ గా నటించింది. అలాగే జనతా గ్యారేజ్ మూవీ లో సమంత తో పాటు నిత్యా మీనన్ కూడా హీరోయిన్గా నటించింది.

ఇలా ఎన్టీఆర్ , సమంత కాంబో లో వచ్చిన ప్రతి సినిమాలో సమంత తో పాటు మరో హీరోయిన్ కూడా ఈ మూవీ లో భాగం అయింది. అలా వీరిద్దరి కాంబోలో రూపొందిన ప్రతి సినిమాలో కూడా ఈ కామన్ పాయింట్ ఉంది. ఎన్టీఆర్ , సమంత కాంబో లో 4 సినిమాలు రాగా అందులో బృందావనం , జనతా గ్యారేజ్ సినిమాలో మంచి విచారణ అందుకున్నాయి. అలాగే ఈ రెండు మూవీలలోని సమంత నటనకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి లభించాయి. ఇక రామయ్య వస్తావయ్య , రభస సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాగే సమంత కూడా ఈ సినిమాలో తన నటన కంటే కూడా అందాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: