అంతులేని కథ (1976) సినిమా గురించి ఎన్ని విశేషాలు చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి ఎన్నో విశేషాలు ఉంటాయి. "అంతులేని కథ"కు అంతులేని విశేషాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో జయప్రద, ఫటాఫట్ జయలక్ష్మి, రజనీకాంత్, శ్రీప్రియ కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ ఓ అతిధి పాత్రలో మెరిసాడు.

దీన్ని కె.బాలచందర్ మార్క్ & మేజిక్ సినిమాగా చెబుతుంటారు. ఈ సినిమా కంటే ముందు హీరోయిన్ జయప్రద భూమి కోసం (1974) , నాకూ స్వతంత్రం వచ్చింది (1975) సినిమాల్లో నటించింది కానీ ఆ సినిమాల ద్వారా ఆమె పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అందుకే అంతులేని కథ మూవీ తర్వాతనే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ స్టేటస్ సాధించింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ అందరికీ ఒక రాక్షసులాగా కనిపిస్తుంది. ఎలాంటి సపోర్టు అందించని కుటుంబ సభ్యులకు కరిగిపోతుంది. ఆ అభాగ్యురాలి పాత్రలో జయప్రదం అద్భుతంగా నటించి మెప్పించింది. నిజానికి అదే ఆమెకు ఇచ్చిన మొట్టమొదటి ఫుల్ లెన్త్ హీరోయిన్ రోల్.

ఇది తమిళ హిట్ మూవీ "అవల్ ఒరు తొడర్ కధై"కు రీమేక్. తమిళ వెర్షన్‌లో జయప్రద పాత్రను సుజాత చేసింది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని 1997లో బెంగాలీలో "కబిత" టైటిల్‌తో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈ బెంగాలీ మూవీలో జయప్రద రోల్‌లో మాలాసిన్హా యాక్ట్ చేసింది. 1983లో కన్నడంలోనూ దీన్ని రీమేక్ చేయగా అందులో సుహాసిని మెయిన్ లీడ్ పోషించింది. 1982లో రేఖ హీరోయిన్‌గా "జీవన్ ధారా" పేరుతో హిందీలో రీమేక్ అయ్యే మంచి హిట్ సాధించింది. ఈ 5 భాషల సినిమాల్లో లీడర్ రోల్ అందరికన్నా జయప్రదే బాగా చేసిందని ఫిలిం క్రిటిక్స్ అంటారు.

ఈ సినిమాలో బాల సుబ్రహ్మణ్యం పాడిన "తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల" పాట భారీ హిట్ అయింది. మిమిక్రీ ఆయన ఈ పాట పాడారు. ఈ సాంగ్ అలా పడటం ఒక బాలుకి తప్పితే మరెవరికీ సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. తాళికట్టు శుభవేళ పాట చూసేందుకు కూడా ఒక మాస్టర్‌పీస్ లాగా కనిపిస్తుంది. ఇందులో అడవిలో జంతువుల వలె బాలు మిమిక్రీ చేస్తుంటారు. ఆ మిమిక్రీతోనే ఈ సినిమా కథకు ముడిపెట్టారు. అప్పట్లో ఈ పాట ప్రయోగం చాలా మందిని ఆశ్చర్యపరిచింది అలానే ఇందులోని "దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి" పాటను జేసుదాసు చాలా బాగా పాడారు. ఈ పాటలకు ఆత్రేయ లిరిక్స్ అందించారు. ఎమ్మెస్ విశ్వనాథన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇది రజనీకాంత్, శ్రీప్రియలకు తెలుగులో మొదటి సినిమా. ఇందులో రజనీకాంత్ స్టైలుగా సిగరెట్ కాల్చాడు. ఈ సినిమాతో జయలక్ష్మి కాస్త ఫటాఫట్ జయలక్ష్మిగా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం విశాఖపట్నంలోనే కంప్లీట్ చేశారు. ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా బాగా ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: